calender_icon.png 13 December, 2025 | 9:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్నం టు పల్లె‘టూరు’.. కిటకిటలాడిన రైళ్లు,బస్సులు

11-12-2025 01:48:30 AM

మహబూబాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి పట్నం నుంచి జనం పల్లెబాట పట్టారు. పల్లె ప్రాంతాల నుంచి ఉద్యోగ ఉపాధి ఇతర వ్యాపారాల నిమిత్తం పట్టణాలకు వలస వెళ్లిన ఓటర్లు తొలి విడత గురువారం నిర్వహించే పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి సొంత ఊరుకు పయనమయ్యారు.

దీనితో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోయాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పట్టణాలు ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డ వారికి ఫోన్ చేసి తమకు ఓటు వేయడానికి తప్పకుండా రావాలంటూ అభ్యర్థించారు. దీనికి తోడు కొందరు పట్టణాల్లో స్థిరపడ్డ ఓటర్లకు రవాణా చార్జీలు కూడా చెల్లించడానికి ముందుకు రావడంతో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలు పల్లె బాట పట్టారు.

ఇక గ్రామాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోకపోతే భవిష్యత్తులో ఏదైనా జరిగితే తమకు గ్రామం నుండి సరైన స్పందన లభించగానే అభిప్రాయంతో చాలామంది పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి పట్టణం ఉండి పల్లెబాట పట్టారు. ఫలితంగా బుధవారం వరంగల్, హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుండి పల్లెలకు వెళ్లే రైళ్లు, బస్సులు కిటకిట లడాయి.

పట్టణాల్లో నివాసముంటున్న ప్రజలు సొంత ఊర్లకు రావడంతో పల్లెల్లో పండగ వాతావరణం నెలకొంది. గురువారం ఎన్నికలు జరుగుతుండడంతో రెండు రోజులపాటు పట్టణాల నుండి పల్లెల్లో నివసించేందుకు సన్నద్ధులై పల్లెలకు చేరుకుంటున్నారు. దీనితో ఎక్కడ చూసినా జన సందోహం కనిపిస్తోంది.