11-12-2025 01:50:00 AM
మరోవైపు సీసీ రోడ్ల నిర్మాణం చేస్తున్న అధికార పార్టీ నాయకులు
గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్‌కు విరుద్ధం
నిర్లక్ష్యం వహిస్తున్న ఏఈ,డీఈలు
కన్నాయిగూడెం, డిసెంబర్10(విజయక్రాంతి):ఒకవైపు పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉండగా కన్నాయిగూడెం మండలంలోని లక్ష్మీపురం, ముప్పనపల్లి గ్రామాల్లో యథేచ్ఛగా సీసీ రోడ్లు నిర్మాణం అధికార పార్టీ నాయకులు చేస్తున్నారు అధికార పార్టీ నాయకులకు ఎన్నికల్ కోడ్ వర్తించదా? అని స్థానికులు ఆరోపిస్తున్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందేందకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకు దిగజారుతుందని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నాయి.పంచాయతీ రాజ్ ఏ.ఈకి ‘విజయక్రాంతి‘ రిపోర్టర్ ఛరవాణి ద్వారా సమాచారం కోరాగా మాకు సమాచారం లేదు ఎంపిడిఓ ఎమైనా అనుమతి ఇచ్చారేమో అని సమాదానం ఇచ్చారు.
ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కొన్ని నియమాలను రూపొందించింది. అయితే, ఈ కోడ్ అమలులో ఉన్నపుడు ఎన్నికల్లో గెలవడం కోసం అధికారంలో ఉన్న పార్టీలు ప్రజాధనాన్ని వినియోగించకూడదు ఎన్నికల ప్రచారం మొదలుకొని పోలింగ్ తేదీ వరకు పార్టీలు, నేతలు ఈ నియమాలకు లోబడి ఉండాల్సిందే. అయితే ఈ కోడ్ షెడ్యూల్ ప్రకటించిన తేదీ నుంచి ఫలితాలు విడుదలయ్యే వరకు అమల్లో ఉంటుంది. ఈ సమయంలో నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం సూచించింది ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అని ఆయా గ్రామాల ప్రజలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు
కన్నాయిగూడెం ఎంపీడీఓ వివరణ
మాకు సమాచారం లేదు మేము ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.