calender_icon.png 12 December, 2025 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్ కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్ సెక్షన్ అమలు

11-12-2025 01:47:08 AM

ఎస్పీ డాక్టర్ శబరీష్ 

మహబూబాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికలు నిర్వహించే పోలింగ్ కేంద్రాల వద్ద బి ఎన్ ఎస్ 163 సెక్షన్ అమల్లో ఉంటుందని, 100 నుండి 200 మీటర్ల పరిధిలో ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తామని, ప్రజలు అనవసరంగా గుమి గూడ కూడదని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ తెలిపారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని కేసముద్రం మండల కేంద్రంలో పోలింగ్ సామాగ్రి, సిబ్బంది కేటాయింపు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను ఎస్పీ సందర్శించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, వాటర్ బాటిళ్లు, ఇంకు బాటిళ్లు, ఆయుధాలు, పెన్నులకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. క్యూలైన్ ద్వారా ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపారు. ఒంటి గంట తర్వాత పోలింగ్ కేంద్రాల్లోకి ఓటర్లకు అనుమతి ఉండదని, ఓటర్లు తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డులను వెంట తెచ్చుకోవాలని సూచించారు.

సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై ప్రత్యేకంగా కొనసాగుతోందని, ప్రచారం ముగిసిన నేపథ్యంలో బయట వ్యక్తులు గ్రామాల్లో ఉండకూడదని తెలిపారు. ఏవైనా అనుమానాస్పద విషయాలు గమనిస్తే వెంటనే 100కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలని, గొడవలు అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని ఎస్పీ తెలిపారు.