calender_icon.png 8 July, 2025 | 9:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాల అభివృద్ధిలో పోషకులను భాగస్వామ్యం చేయాలి

08-07-2025 05:42:43 PM

నిర్మల్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో పోషకులను భాగస్వామ్యం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు(District Education Officer Rama Rao) అన్నారు. మంగళవారం కడెం మండలంలోని లింగాపూర్ ఉన్నత పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులు విద్యార్థులతో మాట్లాడారు. ఉపాధ్యాయులకు సమయపాలన పాటించాలని విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని సూచించారు. ప్రతినెల పోషకుల సమావేశం నిర్వహించి పాఠశాల అభివృద్ధిపై చర్చ నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రవీణ్ కుమార్ నరసయ్య పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.