04-09-2025 12:20:57 AM
కరీంనగర్, సెప్టెంబరు 3 (విజయ క్రాంతి): విద్యారంగంలో ఉపాధ్యాయుల సే వలు వెలకట్టలేనివని, అవకాశాన్ని వినియోగించుకొని విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. బుధవారం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో ముందస్తుగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు తల్లి లాంటి వారని, వారు పిల్లలను ఆదరించి చక్కటి వి ద్యాబుద్ధులు నేర్పాలని అన్నారు. చాలామం ది పేద, మధ్యతరగతి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వస్తారని, వారికి సేవ చేసే అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. వేలాదిమంది భవిష్యత్తును సన్మార్గంలో నడి పే అవకాశం ఉపాధ్యాయులకు ఉందని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు గ్రామాలలో ఇంటింటికి వెళ్లి పాఠశాలల్లో త మ పిల్లల విద్యా విషయాలను వివరించాలని, తద్వారా హాజరు శాతాన్ని మరింతగా పెంచుకోవచ్చని అన్నారు. ఉపాధ్యాయులు 100% పాఠశాలకు హాజరైతే విద్యార్థుల హా జరు కూడా అదేవిధంగా నమోదవుతుందని అన్నారు. పాఠశాల విద్యలో జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలపాలని కోరారు.
అవార్డు స్వీకరించిన వారు మాత్రమే కాకుండా చాలామంది ఉపాధ్యాయులు తమ సేవల ను గోప్యంగా అందిస్తున్నారని అన్నారు. వా రందరికీ అభినందనలు తెలిపారు. అనంత రం ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 43 మం ది ఉపాధ్యాయులకు, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 17 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందజేశారు. రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులను సత్కరించా రు.
గత విద్యా సంవత్సరం 10వ తరగతిలో నూరు శాతం ఫలితాలు సాధించిన 95 ప్ర భుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు గోడ గడియారాలను బహుమతులుగా అం దజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ, మానకొండూరు శాసన సభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా విద్యాధికారి చైతన్య జైనీ, విద్యాశాఖ కోఆర్డినేటర్లు అశోక్ రెడ్డి, మిల్కూరి శ్రీనివాస్, ఆంజనేయులు, కృపారాణి, జిల్లా సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి, తదితరులుపాల్గొన్నారు.