08-09-2025 04:53:22 PM
నిర్మల్,(విజయక్రాంతి): ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన తన భర్త సురేష్ రెండేళ్ల క్రితం అక్కడే ఉపాధి పొందు గుండెపోటుతో మరణించారని దస్తురాబాద్ మండలం కొత్త పెద్దూరుకు చెందిన మమత ఆవేదన వ్యక్తం చేసింది. సోమవారం తమ పిల్లలతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం వచ్చి తన భర్త చనిపోవడం వల్ల విదేశాలకు పోయేందుకు అప్పులు తెచ్చారని భర్త చనిపోవడం వల్ల తాను ఇద్దరు పిల్లలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రభుత్వం ఏదైనా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని గల్ఫ్ సంక్షేమ సంఘం అధ్యక్షులు స్వదేశీ పరికిపండ్ల తో కలిసి జిల్లా కలెక్టర్కు ఆవేదనను విన్నవించినట్లు తెలిపారు