23-08-2025 05:39:35 PM
ఏరియా కోసం మిమ్మల్ని ఎవరు పంపించారు
రైతులను కోరిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): నిజంగా మీరు ఎవరైనా పంపిస్తే వచ్చారా... నిజమే మాట్లాడుతున్నారా... దేవుని సాక్షిగా చెప్పండి అంటూ జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ దగ్గర యూరియా విక్రయ కేంద్రం దగ్గర మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ యూరియా కోసం వచ్చిన రైతులను అడిగారు. యూరియా విక్రయ కేంద్రం దగ్గర రైతులు పడిగాపులు కాస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగానే రైతులు ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంజనేయులు రిక్షా నడిపే వ్యక్తి కి మూర్చ రావడంతో అక్కడే కొందరు పండుకోబెట్టారు ఈ విషయాన్ని గమనించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెంటనే అంబులెన్స్ ని పిలిపించి ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య చికిత్స నిమిత్తం పంపించారు.
యూరియా విక్రయ కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచాలని కోరారు. హన్వాడలో కూడా రైతులతో ప్రత్యేకంగా మాట్లాడి వేరే ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూరియా కోసం ధర్నాలు చేయాలని బి.ఆర్.ఎస్ నేతలు ఎవరు ప్రోత్సహించడం లేదని రైతులకు అవసరం ఉండే ఏరియా కోసం విక్రయ కేంద్రాల దగ్గర పడిగా అప్పుడు కాస్తున్నారని చెప్పారు. ప్రభుత్వము మాయమాటలు చెప్పి ప్రజలను ఇబ్బందులు గురి చేయకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజలే తిరగబడతారని ఈ విషయాన్ని ప్రభుత్వం గమనించాలన్నారు.