calender_icon.png 29 November, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంతో పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ భేటీ

29-11-2025 12:25:56 AM

పంచాయతీ ఎన్నికలు, ప్రజాపాలన వారోత్సవాలపై చర్చ

హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు, పార్టీ అనుసరించిన వ్యూహాలపై చర్చించినట్లు తెలిసింది. డిసెంబర్  1 నుంచి 9 వరకు నిర్వహించే ప్రజా పాలన వారోత్సవాలు విజయవంతం చేయడం, అందులో పార్టీ అనుసరించాల్సిన అంశాలపై చర్చించుకున్నారని సమాచారం.

పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో మాట్లాడాలని, ఎక్కడై నా లోటుపాట్లు ఉంటే వాటిని వెంటనే సరిచేసుకుని ముందుకు పోవాలని నిర్ణయించారు.  మంత్రులు,  ఎమ్మెల్యేలు, నియోజక వర్గ పార్టీ ఇన్‌చార్జ్‌లు నిత్యం స్థానికంగా ఉండేలా  మానిటరింగ్ చేయాలని పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సూచించినట్లు సమాచారం. 

వీటితో పాటు డిసెంబర్ 2న నూతన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పీసీసీ కార్యవర్గ సమావేశం కూడా నిర్వహించే అవకాశం ఉంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కకుమార్‌గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్, ఏఐసీసీ ఇన్‌చార్జ్ కార్యదర్శులతో పాటు పార్టీ ముఖ్య నేతలు కూడా హాజరుకానున్నారు.