29-11-2025 12:25:11 AM
సిబ్బంది ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలి: జిల్లా ఎస్పి
నల్గొండ, నవంబర్ 28: పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం వైద్య శిబిరం నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి విది నిర్వహణలో ఒత్తిడి కారణంగా సమయానికి ఆహారం నిద్ర లేకపోవడం వలన అనేక రకాల ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుందనీ అన్నారు.
సిబ్బంది. ప్రతి రోజూ వ్యాయామం, నడక, యోగాలాంటివి రోజువారీ దిన చర్యలో; బాగం చేసుకోవాలని అన్నారు. విధి నిర్వహణే కాకుండా సిబ్బంది; సంక్షేమం కొరకు ఉచిత హెల్త్ క్యాంపు లు నిరహిస్తున్నామని అన్నారు. గత సంవత్సరం నిర్వహించిన మెడికల్ క్యాంపులో 8 మందికి గుండె సంబంధిత వ్యాదులు ఉన్నాయని గమనించి సరైన చికిత్స అందించి; కాపాడడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యుల సలహాలు సూచనలు పాటించాలని సూచించారు. హెల్త్ క్యాంపుకు సహకరించిన వారికీ ప్రత్యేకంగా; కృతజ్ఞతలు తెలిపారు.శనివారం మిర్యాలగూడ డివిజన్ పరిధిలోనీ సిబ్బందికి హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమం లో అడిషనల్ ఎస్పీ రమేష్,ఎస్.బి డియస్పి మల్లారెడ్డి,నల్లగొండ డీఎస్పీ శివ రాం రెడ్డి,ఏ.ఆర్ డీఎస్పీ శ్రీనివాస్, డాక్టర్ ఉదయభాస్కర్, సుదీర్, ఆర్థోపెటిక్, డాక్టర్ సాయి సందీప్ పాలమానాలాజిస్ట్, అంకలాజిస్ట్ డాక్టర్ సాయి, డాక్టర్ సుజాత గైనకాలగిస్ట్, డాక్టర్ డేవిడ్ ప్రిడియాట్రీషన్, ఐ.యం.ఎ; ప్రసిడెంట్ డాక్టర్ రమేష్,డాక్టర్ పుల్లారావు,డ్రగ్ అండ్ కెమిస్ట్రీ ప్రెసిడెంట్ పరమాత్మ సిఐలు రాఘవరావు, మహా లక్ష్మయ్య,రాజశేఖర్ రెడ్డి,శ్రీను నాయక్, రఘువీరారెడ్డి,ఆర్‌ఐలు సంతోష్,్ర శీను, నరసింహ, ఎస్‌ఐలు, సైదులు, గోపాల్ రావు సిబ్బంది పాల్గొన్నారు.