20-08-2025 12:21:59 AM
నంగునూరు: మండల పరిధిలోని అక్కెనపల్లి గ్రామానికి చెందిన పిడిశెట్టి సదానందం ఉస్మానియా యూనివర్సిటీ నుండి పీహెచ్డీ పట్టా అందుకున్నారు. అక్కెనపల్లి గ్రామానికి చెందిన సదానందం ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ టి. క్రిష్ణకుమార్ పర్యవేక్షణలో వాణిజ్య శాస్త్రంలో "నిరర్ధక ఆస్తులు- నిర్వహణ" అనే అంశంలో పీ.హెచ్.డీ పూర్తి చేశారు.
ఈ మేరకు మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఇస్రో చైర్మన్ నారాయణన్, ఓయూ వీసీ కుమార్ ల చేతుల మీదుగా సదానందం పీ.హెచ్.డీ పట్టాను అందుకున్నారు. పీ.హెచ్.డీ పూర్తి చేసిన సదానందంను పలువురు అధ్యాపకులు, గ్రామస్తులు అభినందించారు.
ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ.. ప్రపంచంలో అత్యంత గొప్ప యూనివర్సిటీతో పాటు ఇటీవల 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందడం తనకెంతో గర్వంగా ఉందన్నారు. తనకు సహకరించిన అధ్యాపకులకు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.