calender_icon.png 14 September, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రిడ్జికి తాత్కాలిక మరమ్మతులు

14-09-2025 12:17:38 AM

శ్రమదానం చేసిన గ్రామస్తులు

చిగురుమామిడి, సెప్టెంబర్‌౧౩( విజయక్రాంతి): ఇటీవల కురిసిన భారీ వర్షానికి ఇందుర్తి కోహెడ మెయిన్ రోడ్డు బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలకు అంత రాయం ఏర్పడి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో సమస్యను పరిష్కరించేందుకు స్థానికులు నడుం కట్టా రు. శనివారం గ్రామస్తులు బ్రిడ్జిపై ఉన్న రోడ్డుకి తాత్కాలిక మరమ్మతులు చేశారు.

గ్రామానికి చెందిన గొల్ల రాజయ్య, అమరగొండ కొమురయ్య, చెప్యాల రాములు, ఎంబరి శ్రీనివాస్ తదితరులు రోడ్డుకు మరమ్మతులు చేశారు. దీంతో ఇందుర్తి కోహెడ బ్రిడ్జిపై నుంచి రాకపోకలు యధావిధిగా సాగుతున్నాయి. ఇప్పటికైనా స్థానిక మంత్రి స్పందించి హైలెవల్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.