calender_icon.png 14 September, 2025 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మావోయిస్టుల స్మారక చిహ్నం కూల్చివేత

14-09-2025 12:19:14 AM

  1. వట్టేకల్ అడవిలో కూల్చివేసిన సైనికులు
  2. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ఆపరేషన్ నిర్వహించిన భద్రతా దళాలు 

చర్ల, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి) :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లోని  కాంకేర్‌లో మావోయిస్టు  ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా దళాలు మరో ప్రధాన ఆపరేషన్ నిర్వహించాయి. కాంకేర్ జిల్లాలోని పార్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టేకల్ అడవిలో మావోయిస్టులు నిర్మించిన 14 అడుగుల ఎత్తున అమరవీరుల స్మారక చిహ్నాన్ని 47 బెటాలియన్ బీఎస్‌ఎఫ్, పఖంజూర్ సైనికులు కూల్చివేసారు.

భారీ వర్షాలు మరియు కష్టతరమైన రోడ్లు ఉన్నప్పటికీ, సైనికులు వాలర్ నది, అనేక వాగులను దాటి వట్టేకల్ మరియు పారలంస్పి గ్రామ లోతైన అడవులకు చేరుకుని ఈ ఆపరేషన్‌ను పూర్తి చేశారు. పెట్రోలింగ్ చేస్తున్నప్పు డు, సైనికులు చనిపోయిన మావోయిస్టు నాగేష్ స్మారక చిహ్నాన్ని కనుగొన్నారు, దానిని వెంటనే పెకిలించి నాశనం చేశారు. ఇప్పటివరకు పలు ప్రాంతాల్లో, అడవి గ్రా మాల్లో  మావోయిస్టులు నిర్మించిన స్థూపాలను భద్రతా బలగాలు కూల్చి వేశాయి.