calender_icon.png 14 September, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లలకు పేరెంట్స్ స్వేచ్ఛనివ్వాలి

14-09-2025 12:17:46 AM

‘అభయమ్ మసూమ్ సమ్మిట్’లో సుప్రీమ్ హీరో సాయిదుర్గతేజ్

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 13 (విజయకారతి): ప్రపంచ వ్యాప్తంగా 70 నగరాలు, వేల మంది యంగ్ ప్రొఫెషనల్స్ కలిసి కాన్పిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీలో భాగంగా యంగ్ ఇండియన్స్ ఆధ్వ ర్యంలో పిల్లలపై లైంగిక దాడికి వ్యతిరేక నినాదంతో ‘అభయమ్ మసూమ్ సమ్మిట్’ శనివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.

భారత్ రైజింగ్, యంగ్ ఇండియన్స్, కాన్పిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుప్రిమ్ హీరో సాయిదుర్గతేజ్, మంత్రి సీతక్క, యంగ్ ఇండియన్స్ కో చైర్మన్ భవిన్ పాండ్య, యంగ్ ఇండియన్స్ నేషనల్ చైర్మన్ తరంగ్ ఖురానా, సీఐఐ తెలంగాణ ఛైర్మన్ శివ ప్రసాద్‌రెడ్డి, జోత్స్నసింగ్ హాజరయ్యా రు.

సుప్రిమ్ హీరో సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ.. ‘పిల్లల్ని మనమే కాపాడుకోవాలి. సోషల్ మీడియాలో పిల్లల మీద అబ్యూజ్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. అవన్నీ చూస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అందుకే నేను ఆ సమయంలో అలా రియా క్ట్ అయ్యాను. డార్క్ కామెడీ అంటూ పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తున్నారు.

2015 లో థింక్ పీస్ అనే సంస్థతో పని చేశాను. అరకులో చైల్ ఎడ్యుకేషన్ గురించి పోరాడాను. నేను అక్కడ స్కూల్ నిర్మించాను. తెలంగాణలో నేను కొంత మంది పిల్లల్ని కూడా దత్తత తీసుకున్నాను. పిల్లలతో తల్లిదండ్రులు ఎక్కువ సమయాన్ని గడిపి, అన్ని విషయాలు పంచుకునేలా చేయాలి” అన్నారు.