calender_icon.png 1 November, 2025 | 7:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతించిన మున్నేరు!

01-11-2025 01:06:12 AM

  1. ఊపిరి పీల్చుకున్న ప్రజలు, అధికారులు
  2. ముమ్మరంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు 

ఖమ్మం, అక్టోబరు 31 (విజయక్రాంతి): ఖమ్మంలో పరివాహక ప్రాంతాల ప్రజలను రెండు రోజుల పాటు వణికించిన మున్నేరు శాంతించింది. ఎగువన వర్షాలు ఆగిపోవడం తో మున్నేరుకి వరద ఉధృతి సాధారణ స్థాయి కి చేరుకుంది. ప్రస్తుతం 15 అడుగుల వద్ద స్థి రంగా ప్రవహిస్తోంది. గురువారం రాత్రి నుంచి తగ్గుముఖం పట్టిన మున్నేరు రాత్రి రెండున్నర మూడు గంటల సమయంలో దాదాపు నాలు గు అడుగుల మేర తగ్గి 22 అడవుల వద్ద ప్రవా హం కొనసాగింది.

శుక్రవారం ఉదయానికి మరో నాలుగు అడుగులు మధ్యాహ్నానికి మ రో మూడు అడుగులు మేర వరద తగ్గింది. మున్నేరు సాధారణ స్థితికి చేరుకుంటుండడం తో పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న వా రంతా ఇళ్లకు చేరుకుంటున్నారు. అధికార యం త్రాంగం ఎప్పటికప్పుడు వరదను సమీక్షిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంది. ఇక వరద సాధారణ స్థితికి చేరుకోవడంతో ముంపుకు గురైన ఆయా కాలనీల్లో అధికార యంత్రాంగం పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టింది. ప్రభుత్వ యంత్రాంగం పనితీరు వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు.

వరద వల్ల ఆయా కాలనీలో ఏర్పడిన చెత్త వెంటనే తొలగించడంతో పాటు క్రిమికీటకాలు చేరకుండా శుభ్రపరిచారు. అంటువ్యాధులు ప్రబలకుండా సంబంధిత వైద్యారోగ్య శాఖను అప్రమత్త పరిచింది. శుభ్రమైన తాగునీరు అందిలా ఏర్పాట్లు చేసింది. వరద కొనసాగిన రెండు రోజులు కూడా మంత్రి తుమ్మల ఆదేశాలకు అనుగుణంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మునిసిపల్ కమిషనర్ అభిషేక అగస్త్య ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్దే పనులు చేపట్టారు. నాయకులు, ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పని చేయడంతో ఎలాంటి నష్టం కలగలేదు. 

గతేడాదితో పోల్చితే..

మున్నేరుకు గతేడాది వచ్చిన వరదలు ఖమ్మం పట్టణాన్ని అతలాకుతలం చేశాయి. వరద సాఫీగా వెళ్లే అవకాశం లేకపోవడంతో పరివాహక ప్రాంతాలైన పద్మావతి నగర్,  కాల్వ ఒడ్డు, బొక్కలగడ్డ, ధంసలాపురం, ప్రకాష్ నగర్, జలగం నగర్, సుందరయ్య నగర్ వంటి ప్రాంతాల్లో చాలా ఇళ్లు నీట మునిగాయి. అంతేకాకుండా, బ్యాక్ వాటర్ ఎగదన్నటంతో ఇందిరానగర్, మమత హాస్పిటల్ ప్రాంతాల కాలనీల్లోనికి కూడా వరద నీరు చొచ్చుకు వ చ్చింది.

ఈసారి కూడా మున్నేరు అదే స్థాయి లో ఖమ్మం పట్టణాన్ని ముంచుతుందని అంద రూ భయాందోళనలకు లోనయ్యారు. బుధవారం రాత్రి సమయం నుంచి మున్నేరు వరద అంతకంతకు పెరుగుతుండటంతో అధికారులు వరదను సమీక్షిస్తూ వచ్చారు.

ఎగువన ఎగువ నుంచి వస్తున్న వరదను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ముంపు ప్రాంతా ల్లోని ప్రజలను వెంటనే ఖాళీ చేయించటం మొదలుపెట్టి పునరావాస కేంద్రాలకు తరలించారు. అయితే గురువారం నుంచి తుఫాను ప్రభావం పెద్దగా లేకపోవడంతో ఎగువన  వర్షం తగ్గుముఖం పట్టింది. దీనివల్ల మున్నేరుకి వరద తగ్గిపోవటంతో పెద్దగా నష్టం చేకూరలేదు.