01-11-2025 12:48:53 AM
హైదరాబాద్, అక్టోబర్ 31 (విజయక్రాంతి) : నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మె ల్యే, మాజీ మంత్రి ప్రొద్దుటూరి సుదర్శన్‌రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీఅయ్యాయి. ప్రభుత్వ సంక్షే మ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు సలహాదారుడిగా నియమిస్తున్నట్లు శుక్రవారం ప్రభుత్వం పేర్కొంది. సుదర్శన్‌రెడ్డి క్యాబినెట్ సమావేశాలకు కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. మంత్రుల నివా స ప్రాంగణంలో ఆయనకు క్వార్టర్ కేటాయించాలని కూడా ఆదేశాలు జారీ అయ్యా యి.
అదేవిధంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావుకు సివిల్ సప్ల య్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ప్రభుత్వం అప్పగించింది. ఆయనకు కూడా క్యాబినెట్ హోదా కల్పిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, మాజీ మంత్రి, ఎమ్మె ల్యే సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు మంత్రి పదవులను ఆశించారు.
ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్‌రెడ్డికి మంత్రి పదవి దాదాపు ఖరారైం దని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. రెండో విడతలో ముగ్గురికే మంత్రివర్గం లో చోటు కల్పించడంతో సుదర్శన్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు అలకబూనగా.. పార్టీ పెద్దలు బుజ్జగించడంతో మెత్తబడ్డారు. ప్రేమ్‌సాగర్‌రావుకు మంత్రి పదవి ఇవ్వాలని ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఒత్తిడి తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోయింది.