01-11-2025 12:40:16 AM
ఎమ్మెల్యే పోచారం వెంటనే రాజీనామా చేయాలాంటూ
బోర్లంలో బిఆర్ఎస్ నాయకులు ప్లకార్డులతో నిరసన
నిరసన తెలిపిన బిఆర్ఎస్ శ్రేణులను పోలీస్ స్టేషన్ కు తరలింపు
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల పరిధిలోని బోర్లం గ్రామంలో శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వెళ్లిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కి బిఆర్ఎస్ నాయకులు నుండి నిరసన సెగ తగిలింది. స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ పోచారంపై పార్టీ మారిన ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలి అని నినాదాలు చేశారు. బిఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ లోకి మారిన ఎమ్మెల్యే పోచారం పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
పోచారం తక్షణం రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని బిఆర్ఎస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు బిఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకొని అదుపులోకి తీసుకొని పోలీసు వాహనంలో బాన్సువాడ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ నిరసన కార్యక్రమంలో బారస నాయకులు వెంకట గంగారం, మన్నె అనిల్, హనుమంతు, దివాకర్ రాజకుమార్, దొంతుల నరసింహులు, బోడ రామచందర్, లక్ష్మణ్ తదితరులున్నారు.