calender_icon.png 1 November, 2025 | 7:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కబ్జాలపై ఉక్కు పాదం మోపాలి

01-11-2025 01:07:51 AM

* సిద్దిపేట, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో సీఎం ఏరియల్ సర్వే 

బాధితులకు అండగా ఉంటామని భరోసా

* వరద ప్రాంతాల్లో ఎకరానికి రూ.10 వేల చొప్పున..

ప్రాణనష్టానికి రూ.15 లక్షలు, ఇండ్లు మునిగినవారికి రూ.15 వేల నష్టపరిహారం

  1. నిరాశ్రయులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు 
  2. పూర్తిస్థాయి నష్టాన్ని అంచనా వేయండి
  3. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
  4. కేంద్రం నుంచి నిధులను రాబట్టుకోవడంలో అలసత్వం వద్దంటూ సూచన
  5. వరద నష్టంపై మంత్రులు, 12 జిల్లాల కలెక్టర్లు, జిల్లా అధికారులతో హనుమకొండలో సమీక్ష
  6. అధికారుల సమన్వయ లోపంతోనే సమస్యలు
  7. ప్రాణ నష్టానికి రూ.15 లక్షలు, ఎకరానికి రూ.10 వేలు, ఇండ్లు మునిగిన వారికి రూ.15 వేల నష్టపరిహారం 
  8. ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు 

హనుమకొండ, అక్టోబర్ 31 (విజయక్రాంతి): మొంథా తుఫాను ప్రభావంతో రా ష్ట్రంలో జరిగిన ప్రాణ నష్టానికి రూ.15 లక్ష లు, ఇండ్లు మునిగిన వారికి రూ.15 వేల నష్టపరిహారం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఇం డ్లు కోల్పోయి నిరాశ్రయులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. అందుకు ప్రభావిత ప్రాంతాల్లో పూర్తిస్థాయి నష్టాన్ని అంచనా వేసి, నివేదికను అందజేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అన్ని జిల్లాల్లో భూ కబ్జాలపై ఉక్కు పాదం మోపాలని ఆదేశించారు.

అధికారుల సమన్వయ లోపంతోనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. వరద నష్టంపై కేంద్ర ప్రభు త్వం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకోవడంలో అలసత్వం ప్రదర్శించకూడదని అధికారులను హెచ్చరించారు. సిద్దిపేట, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో శుక్రవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియ ల్ సర్వే నిర్వహించారు. అనంతరం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో భారీ వర్షాలతో జరిగిన పంట, ఆస్తి, ప్రాణ నష్టాలపై మం త్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌లతో కలసి రాష్ట్రస్థా యి అధికారులు, 12 జిల్లాల కలెక్టర్లు, జిల్లా అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యటించి పూర్తిస్థాయి నష్టాన్ని అంచనా వేయాలని, ప్రాణ నష్టం, పంట నష్టం, పశు సంపద, అన్ని శాఖలకు సంబంధించి నష్టానికి సంబంధించి నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇందుకు ప్రజాప్రతినిధుల సహకారం కూడా తీసుకోవాలని, ప్రజా ప్రతినిధులు కూడా తమ, త మ నియోజకవర్గాలకు సంబంధించి కలెక్టర్లకు నివేదిక ఇవ్వాలని సూచించారు. తుఫా ను ప్రభావంతో దాదాపు 12 జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగిందని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, నిధులను రా బట్టుకోవడంలో అలసత్వం ప్రదర్శించకూడదని అధికారులను హెచ్చరించారు. నివేదిక ఆధారంగానే కేంద్రం నుంచి రాబట్టుకోవచ్చని చెప్పారు. అధికారులు తమ నివే దికలలో తాత్కాలిక పరిష్కారం కాకుండా, శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రూ పొందించాలని సూచించారు. వివిధ శాఖలో పనిచేస్తున్న అధికారుల మధ్య సమన్వయ లోపంతో సమస్యలు పెరుగుతున్నాయని, అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

వరంగల్, హ నుమకొండ పట్టణాల్లో నాలాలు కబ్జాలకు గురైన వాటిని అధికారులు గుర్తించి, తక్షణమే తొలగించాలని, కబ్జాదారులు ఎంతటి వారైనా ఉపక్షించొద్దని అన్నారు. ముప్పు ప్రాంతాల్లో వరదలు తగ్గిన నేపథ్యంలో సరైన శానిటేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, వరదల్లో ప్రాణ నష్టం జరిగినచో ట రూ.5 లక్షలు పరిహారం ప్రభుత్వం సిద్ధం గా ఉందని, వివరాలను పోలీస్ అధికారుల సహకారంతో సేకరించాలని ఆదేశించారు.

రైతులను ఆదుకునేందుకు అంచనాలు 

పంటనష్టం, పశు సంపద నష్టపోయిన చోట వారికి ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం, పశువులకు రూ.5 వేల తక్షణ పరిహారాన్ని చెల్లించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూ చించారు. పంట పొలాల్లో ఇసుక మేటలు పేరుకున్న రైతులను ఆదుకునేందుకు అంచనాలు వేసి రైతులకు తక్షణ సహాయం అం దించాలని ఆదేశించారు. వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో ఇండ్లు మునిగిన వారికి ప్రతీ ఇంటికి రూ.15 వేలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులైన వారిని గుర్తించి వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కలెక్టర్లను కోరారు.

మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, స్మార్ట్ సిటీలో చేయాల్సిన పనులపై ప్రత్యేక నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో ఎమ్మెల్యేలు నాగిని రాజేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజ్, వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మె ల్సీలు బండ ప్రకాష్, బసవరాజు సారయ్య, ప్రభు త్వ సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు స్నేహ శబరిష్, సత్య శారదా దేవి, హనుమకొండ సీపీ సన్‌ప్రీత్‌సింగ్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, మేయర్ సుధారాణి, కార్పొరేటర్ మౌనిక, అధికారులు పాల్గొన్నారు.

మూడు జిల్లాల్లో ఏరియల్ సర్వే

వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన

హుస్నాబాద్: మొంథా తుపాను సృష్టించిన బీభత్సం నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి శుక్రవారం సిద్దిపేట, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్, కోహెడ, భీమదేవరపల్లి, అక్కన్నపేట, ఎల్కతుర్తి మండలాల్లోని పరిస్థితులను, నష్ట తీవ్రతను సీఎం స్వయంగా హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు.

ముఖ్యమంత్రి ఏరియల్ వ్యూలో హుస్నాబాద్ మార్కెట్ యార్డు పూర్తిగా నీట మునిగి, ధాన్యం తడిసిపోయిన దృశ్యాలు కనిపించాయి. వరద ఉధృతికి కొట్టుకుపోయిన రోడ్లు, కల్వర్టులను ముఖ్యమంత్రి పరిశీలించారు. మౌలిక వసతులకు జరిగిన భారీ నష్టాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మోత్కులపల్లె గ్రామంలో వరదల్లో గల్లంతై మృతి చెందిన జంట నివసించిన ప్రాంతాన్ని కూడా ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు.