28-10-2025 06:07:04 PM
ముత్తారంలో పోలీసు అమరుల స్మరణార్థం సైకిల్ ర్యాలీలో పెద్దపల్లి డిసిపి కర్ణాకర్..
ముత్తారం (విజయక్రాంతి): సమాజం కోసం పనిచేస్తూ అసాంఘిక శక్తుల చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకున్న పోలీసుల త్యాగాలు మరువలేనివని పెద్దపల్లి ఏసిపి కర్ణాకర్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మంగళవారం ముత్తారం మండలంలోని పోతారం గ్రామ శివారు నుంచి సర్వారం, కాజిపల్లి, లక్కారం, మచ్చుపేట మీదుగా రామగిరి పోలీస్ స్టేషన్ వరకు సైకిల్ ర్యాలీ విద్యార్థులు, యువకులతో కలిసి పోలీసులు ఉత్సవంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ కర్ణాకర్ మాట్లాడుతూ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కాపాడుతున్న పోలీసులు త్యాగధనులన్నారు.
దేశ రక్షణ, ప్రజా శాంతి కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. అమరవీరులు చేసిన గొప్ప త్యాగాలను ప్రజలకు తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. ప్రజలతో పోలీసుల సత్సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి కూడా ఇవి దోహదపడతాయన్నారు. వృత్తిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆశయాలను కొనసాగించేలా పోలీసులు పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని, పెద్దపల్లి ఏసీపీలు మడత రమేష్, గజ్జి కృష్ణ యాదవ్, మంథని, 2-టౌన్ సీఐలు రాజు, ప్రసాద్ రావు, ముత్తారం, మంథని, కమాన్పూర్, ఎస్ఐలు రవికుమార్ సాగర్, ప్రసాద్, ఏసైలు, హెడ్ కానిస్టేబుల్స్, సిబ్బంది, యువకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.