calender_icon.png 28 October, 2025 | 9:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేణుక చౌదరి క్యాంపు కార్యాలయంలో పొంగులేటి జన్మదిన వేడుకలు

28-10-2025 06:09:17 PM

మణుగూరు (విజయక్రాంతి): రాష్ట్ర రెవెన్యూ, గృహ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను జిల్లా కాంగ్రెస్ నాయకులు గురిజాల గోపి ఆధ్వర్యంలో మంగళవారం రేణుకా చౌదరి క్యాంప్ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు, శ్రీనన్న అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను అక్షర మహిళా మండలి అధ్యక్షురాలు పూనం సరోజ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజలు అంటే ప్రాణంగా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన అందిస్తూ వారి కష్టాలను తీరుస్తున్నారని అన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలను తీరుస్తున్న గొప్ప నాయకుడని ఆయన అని కొనియాడారు. కార్యక్రమంలో షబానా, బొడ్డు సౌజన్య, కోరి శ్యామల, సుజాత, రేణుక, వసంత, శైలజ, సౌజన్య, పార్వతి, షరీఫ్, మాధవరెడ్డి  పాల్గొన్నారు.