20-08-2025 01:19:22 AM
రామ్‌చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ కోసం పనిచేస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ ఇంతకు ముందెన్నడూ చూడని లుక్‌లో మెస్మరైజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌షాట్ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేయగా అది దేశవ్యాప్తంగా హ్యుజ్‌బజ్ క్రియేట్ చేసింది.
రామ్‌చరణ్ అందులో సరికొత్త లుక్‌లో ఆకట్టుకున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ నుంచి సెకండ్ లుక్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోందట మూవీటీమ్. ఇందుకోసం ఆయన సిద్ధమయ్యే పనిలో నిమగ్నమై ఉన్నారు. టాప్ సెలబ్రిటీ స్టుటైలిస్ట్ ఆలీం హకీం స్పెషల్ కేర్ తీసుకొని రామ్‌చరణ్‌నను సరికొత్త లుక్‌లో ప్రెజంట్ చేయబోతున్నారు. రామ్‌చరణ్ స్టుల్, స్వాగ్‌లో కొత్త బెంచ్‌మార్క్‌ను క్రియేట్ చేయనున్నారు. జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందుశర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రామ్‌చరణ్ పుట్టిన రోజు సందర్భంగా 2026 మార్చి 27న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్; డీవోపీ: ఆర్ రత్నవేలు; ఎడిటర్: నవీన్ నూలి.