10-07-2025 12:59:17 AM
- ప్రహరీని కూల్చివేయించిన వీ హనుమంతరావు
హైదరాబాద్, జులై 9 (విజయక్రాంతి): ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి దారి లేకుం డా గోడను నిర్మిస్తున్న బిల్డ్ బ్రిక్ సంస్థపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ.హనుమంతరావు కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో కంపెనీ నిర్మాణం కోసం కేటాయించిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని క్రీడాభివృద్ధికి కేటాయించాల న్నారు. ఉప్పల్ క్రికేట్ స్డేడియానికి వెళ్లకుండా నిర్మిస్తున్న ప్రహరీని వీహెచ్ నేతృత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం జేసీబీతో కూలగొట్టారు.
అంతకుముందు ప్రహరీ నిర్మా ణం అంశాన్ని మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం ఉప్పల్‌లో పారిశ్రామిక వాడ కోసం ఏపీ ఐఐసీకి 500 ఎకరాలు కేటాయించిందని, అందులో పెంగ్విన్ అనే టెక్స్‌టై ల్స్ కంపెనీకి కూడా 40 ఎకరాలు కేటాయించారని తెలిపారు. కొంతకాలం తర్వాత కంపెనీ మూసివేసి.. కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా సదరు సంస్థ మోసం చేసిందని ఆయన ఆరోపించారు. ఐపీఎల్ మ్యాచ్ జరిగినప్పు డు పార్కింగ్‌కు ఇబ్బంది అవుతుందని, ప్రభుత్వం ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని క్రీడల కోసం వినియోగించాలన్నారు.