10-07-2025 12:57:59 AM
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి,జూలై9(విజయక్రాంతి): జీవకోటికి మొక్కలే ప్రాణాధారమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. బుధవారం గంగాధర మండల కేంద్రంలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతి థిగా హాజరైన ఎమ్మెల్యే స్థానిక నాయకులు అధికారులతో కలిసి మొక్కలు నాటారు.
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. వన మహోత్సవంలో ప్రజలను భాగస్వాములను చేసి గ్రామాల్లో విరివిగా మొక్క లు నాటాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి, మండలాధ్యక్షుడు పురమల్ల మనోహర్, సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్ రావు, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్ ,
తోట సంధ్య కరుణాకర్, ఎంపీడీవో రామ్, బుర్గు గంగ న్న,సత్తు కనుకయ్య, గుజ్జుల బాపురెడ్డి, అట్ల శేఖర్ రెడ్డి, కంకణాల రాజగోపాల్ రెడ్డి, గునుకొండ బాబు, పడిత పల్లికిషన్,పడాల రాజన్న ,దోర్నాల శ్రీనివాసరెడ్డి,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రుద్ర మల్లేశం దీకొండ మధు, గరిగంటి కరుణాకర్, తాళ్ల శ్రీనివాస్, గంగాధర సుదర్శన్, నాగేందర్ రెడ్డి, ఆముదాల రోహిత్ రెడ్డి, ప్రభాకర్, ఆనంద్,దోమకొండ మహేష్,నగేష్, ప్రభాకర్, శ్రీనివాస్, కోలాపురం లక్ష్మణ్, కుమారస్వామి, దాతు అంజి, మంత్రి మహేందర్, పానుగంటి సత్యం తదితరులుపాల్గొన్నారు.