10-07-2025 12:59:33 AM
రాజన్న సిరిసిల్ల, జులై 9 (విజయక్రాంతి): రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి, బండి, సంజయ్ కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదా ఆక్సిడెంటల్గా వచ్చాయని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షు డు తోట ఆగయ్య విమర్శించారు. వీరిద్దరిలో ఏ ఒక్కరికీ ప్రజా సమస్యలపై కనీస పరిజ్ఞానం లేద ని ఎద్దేవ చేశారు. ఉదయం లేస్తే ఉద్యమ నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను విమర్శించడమే లక్ష్యంగా పని చేస్తున్నారని అన్నారు.
ప్రజాపాలన అందిస్తామని ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రేవంత్ రెడ్డి పాలన చేతగాక బూతు మాటలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు. ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలో పా ల్గొనని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని, అదే తరహాలో బండి సంజయ్ అక్సిడెంటల్గా కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్నాడని పేర్కొన్నారు.
ఆంద్రపాలకుల మోచేతి నీళ్లు త్రాగే వ్య క్తులు రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. పదేండ్ల పాలనలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపారని, తమ పాలనతో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన నాయకులు కేటీఆర్, హరీష్ రావు అని తెలిపారు. రేవంత్రెడ్డితో, ఆయన మంత్రివర్గ సభ్యులు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కేసీఆర్, కేటీఆర్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని వాపోయారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పని చేస్తున్న ఏ ఒక్క నాయకుడికి ప్రజాసమస్యలపై పట్టిం పులేదన్నారు. డబ్బు సంచులతో నాడు పిసిసి అధ్యక్ష పదవితో పాటు నేడు ముఖ్యమంత్రి పదవిని కొన్నాడని ఆరోపించారు.
ప్రజాపాలన పేరుతో అధికారం చేపట్టి ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతూ పొద్దుగడుపుతున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో సిద్ధం వేణు,జిందం చక్రపాణి, న్యాలకొండ రాఘవరెడ్డి,కుంభాల మల్లారెడ్డి,బండ నరసయ్య, ఎదురుగట్ల చంద్ర గౌడ్, మ్యాన రవి, తదితరులు పాల్గొన్నారు.