18-09-2025 12:22:52 AM
డాక్టర్ సంగని మల్లేశ్వర్ :
నేపాల్ రాజధాని ఖాట్మండు ఆర్థనాదాలు గుండెలు పిండేశాయి. సోషల్ మీడియాపై ప్రభుత్వ నిషేధాన్ని ని రసిస్తూ నేపాల్‌లో యువతరం చేపట్టిన ఉద్యమాన్ని అక్కడి మీడియా ‘జనరేషన్ జెడ్ రివల్యూషన్’గా అభివర్ణించింది. సెప్టెంబర్ 8న జరిగిన ఘర్షణల్లో వేలాది మంది యువతీ యువకులు ఏకంగా పార్లమెంట్ భవనం మీద దాడికి పాల్పడడం హింసకు దారి తీసింది. ప్రభుత్వ బలగాలు కాల్పులకు తెగబడటంతో పదుల సంఖ్యలో మరణించగా.. వందలాది మంది గా యపడ్డారు.
టియర్ గ్యాస్, వాటర్ క్యాన న్లు, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించడంతో పార్లమెంట్ ప్రాంగణం యుద్ధభూమిగా మా రిపోయింది. బంగ్లాదేశ్‌లో హసీనా ప్ర భుత్వం తరహాలో నేపాల్‌లో కేపీ శర్మ ఓలీ తీవ్ర దమనకాండకు పాల్పడుతున్నా యు వత వెనకడుగు వేయడం లేదు. ము ఖ్యంగా జనరేషన్ జెడ్ (జెన్ జెడ్) నిరసన లు దేశాన్ని కుదిపేసింది.
పాతికకు పైగా సామాజిక మాద్యమ వేదికలు నిషేధానికి గురైన వెంటనే, ఒక ప్రధాన నాయకుడ ంటూ లేకపోయినా.. టిక్‌టాక్ ఆధారంగా ఇంతటి భారీ స్థాయి జనసమీక రణతో సా గుతున్న ఈ ఉద్యమం ఓలీ ప్రభుత్వాన్ని ప డగొట్టేలా చేసింది. ఓలీ ప్రభుత్వం ఒకప్పుడు చైనా యాప్‌లకు అనుమతిలిచ్చి.. ఇప్పుడు సోషల్ మీడియాపై నిషేధం వి ధించడం యువతలో ఆగ్రహం తెప్పించి ంది.
ఈ నేపథ్యంలో శ్రీ లంక, బంగ్లాదేశ్, నేపాల్ పరిణామాల ప్రభావం భారతదేశాన్ని తాకుతుందా? అనే అనుమానం అ ందరిలో కలుగుతుంది. అవినీతి, ఆర్థిక అ సమానతలు, నిరుద్యోగం వంటివి మన దే శంలోని యువతను వేధిస్తున్నాయనేది వాస్తవం. ఈ మధ్య కాలం లో భారత్‌లో సోషల్ మీడియా ప్రభావం చాలానే కనిపిస్తోంది. మన యువతలో చాలా మంది ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వంటి సోషల్ మీ డియా ప్లాట్‌ఫామ్స్‌ను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు. నేపాల్‌లో చిచ్చు రేపిన సోషల్ మీడియా ప్రభావం భవిష్యత్తులో భారత్‌కు పాకుతుందా అంటే చెప్పలేని పరిస్థితి!
నెపో కిడ్స్‌పై ఆగ్రహం
‘జెన్ జెడ్’ నిరసనల వల్ల అకస్మాత్తుగా అధికారం పతనం జరిగిందని బయట నుంచి చూసేవారికి అనిపించవచ్చు. అ యితే యువత మనస్సులో చాల కాల ంగా అవినీతిపై ఉన్న కోపమే సోషల్ మీ డియా నిషేధం రూపంలో బయటకు వ చ్చింది. నెపోకిడ్స్ జల్సాలపై చాలా కాల ంగా లోలోపలే రగిలిపోతున్న ఆ దేశ యువత తాజాగా జరిగిన ఆందోళనల్లో త మ కోపాన్ని ప్రదర్శించారు. నిరసనల్లో నె పోకిడ్స్ హాష్ ట్యాగ్‌ను వైరల్ చేశారు.
నే పాల్ మా జీ ప్రధాని పుష్ప కమల దహాల్ ప్రచండ మనవరాలు స్మిత దహాల్ ఖరీదైన హ్యాండ్ బ్యాగులు సోషల్ మీడియాలో చూపించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తా యి. విదేశీ పర్యటనలు, లగ్జరీ జీవనశైలి జె న్ జెడ్‌కి ఆగ్రహం తెచ్చిపెట్టింది. పాలకు లు, వారి పుత్రరత్నాల విలాసవంతమైన జీవితాలను సామాన్యుల బతుకు కష్టంతో పోలుస్తూ ‘నెపో కిడ్స్‘ వంటి ట్రెండ్స్ విస్తృతంగా ప్రచారమవుతున్నాయి.‘నాయ కుల పిల్లలు విమానాల్లో వస్తారు.
సామాన్యుల పిల్లలు శవపేటికలో తిరిగివస్తారు’ వంటి నినాదాలు అక్కడి ప్రజలను తీవ్ర ప్రభావి తం చేశాయి. దేశంలో సోషల్ మీ డియా కు ఆదరణ పెరిగిపోవడంతో నేపాల్ ప్ర భుత్వం 26 సోషల్ మీడియా ప్లా ట్‌ఫామ్‌లపై నిషేధం విధించింది. దీంతో సెప్టెం బర్ 8న ‘జనరేషన్ జెడ్’ ఆందోళనలతో నేపాల్ అట్టుడికిపోయింది. ఆందోళనకారులు పార్లమెంట్ భవనం, ప్రధాన మం త్రి కార్యాలయాలను తగలబెట్టటమే కా కుండా నేపాల్ ఆర్థిక మంత్రి విష్ణు ప్రసా ద్ పౌడ్వాల్‌ని తరిమి కొట్టారు.
దేశవ్యాప్తం గా అల్లర్లు, ఆందోళనలు పెరిగిపోవడంతో నైతిక బాధ్యత వహిస్తూ నే పాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు. దేశంలో పెరిగిపోయిన అవినీతి, నిరుద్యోగం, రాజకీయ వారసుల సంపన్నుల విలాసవంతమైన జీవనశైలి.. నేపాలి యువత ఆగ్ర హం కట్ట లు తెంచుకొని తిరుగుబాటుగా మారిందనే చెప్పాలి. తమ అధికార కాంక్షతో ఓలీ, ప్రచండ నేపాల్ రాజకీయాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు.
ఒకరి కుర్చీ ఒకరు లాగుతూ రా జ్యాంగాన్ని, చట్టాలను అపహాస్యం చే స్తూంటే, మిగతా పక్షాలన్నీ అధికారం కో సం, అవినీతిలో వాటా కో సం వీరితో వం తులవారీగా చేతులు కలుపుతున్నాయి. రా బడి కోసమో, రాజ్యాంగ నిబంధనల కోస మో సామాజిక మాధ్యమాలను నిషేధించలేదని, పాలకుల అవి నీతి ప్రజలకు తెలి యకుండా వారిపై విమర్శలు, ప్రశ్నలు వ్యాప్తి చెందకుండా నిషే ధం అమలు చేశారనేది ఉద్యమకారులు అభిప్రాయం.
పేరుకుపోయిన అసంతృప్తి
దశాబ్దాలుగా పేరుకు పోయిన అనంతృప్తి యొక్క వ్యక్తీకరణపై నేపాల్ చరిత్ర లో నిరసనలు కొత్తేమీ కావు. 2008లో రా చరిక పాలన రద్దు చేసిన తర్వాత, కమ్యూనిస్టు గ్రూపులు అధికారంలోకి వచ్చాయి. కానీ ఇది రాజకీయ అస్థిరతకు, అవినీతికి మూలమైంది. మావోయిస్ట్ తిరుగుబాటు (1996--2006) దేశాన్ని సివిల్ వార్ లో ముంచేసింది. ఆ తర్వాత ప్రజాస్వామ్య పు నరుద్ధరణ ఆశలు రేకిత్తించింది. అయితే, 2 025లో ప్రో-మోనార్కీ నిరసనలు మళ్లీ త లెత్తాయి.
హిందూ రాజ్యస్థితిని పునరుద్ధరి ంచాలని డిమాండ్ చేస్తూ 60వేల మంది పాల్గొన్నారు. అటువంటిది నేపాల్లో దాదా పు కోటి ముప్పుఐదు లక్షల మంది ఫేస్‌బు క్ వినియోగదారులు ఉన్నారు. ఇక ఇన్ స్టాగ్రామ్ వినియోగదారులు లక్షలాది మ ంది ఉన్నారు. వాట్సాప్ వంటి అప్లికేషన్లకు లెక్కేలేదు. సోషల్ మీడియా ఈ జనరేషన్ జెడ్‌కు ఉల్లాసం, ఉత్సాహంతో పాటు మ ంచి ఉపాధి కూడా ఇస్తున్నది.
సమస్త స మాచారాన్ని అరచేతిలో చూడగలగడంతో పాటు, ఈ నెట్‌వర్క్ ద్వారా వ్యాపారాలు చేసుకుంటూ జీవించే యువత పెద్ద సం ఖ్యలో ఉన్నారు. ఇక స్వదేశంలో ఉపాధి లే క సంపాదన కోసం ఇతర దేశాలకు తరలిపోయిన లక్షలాది మంది తమ కు టుంబీ కులతో, బంధుమిత్రులతో సంభాషి ంచే అవకాశాన్ని కోల్పోయామనే తపన తి రుగుబాటుకు కారణమైంది.
సామాజిక మా ధ్యమాలతోనే పలు దేశాల్లో అవినీతి ప్రభుత్వాలు కూలిపోయినందున, నేపాల్ పా లకులు భయపడటంలో తప్పు లేదు. ఈ అస్థిరత భారతదేశానికి ఆందోళన కలిగించే విషయం. పరిస్థితులు ఎప్పు డూ ఒకేలా ఉండవు. ఈ మార్పు ఒక బ్రేకింగ్ పాయి ంట్. సోషల్ మీడియా నిషేధంపై నేపాల్ లో జరిగిన సంఘటనలను అన్ని దేశాలు చూడాల్సిన ఆవశ్యకత ఉం ది.
బలమైన హెచ్చరిక
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వం చైనా పట్ల ఎక్కువగా మొ గ్గు చేపేది. భారత్ వైపు మొగ్గు చూపే నా యకులు ఇందుకు ప్రత్యామ్నాయంగా ఉ ద్భవిస్తున్నారు. నేపాల్‌లో ప్రస్తుతం పరిస్థి తి మరింత ఉద్రిక్తంగా మారింది. నిషేధా న్ని ఎత్తి వేసినప్పటికీ నిరసనలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. పార్లమెంట్‌లో కి చొరబాటు, మంత్రులు, ప్ర ధానమంత్రి రాజీనామాలు దేశంలో రాజకీయ అస్థిరత ను బయటపెడుతున్నాయి.
అంతేకాదు ఇ ది రాజకీయ సంక్షోభాన్ని మరింత తీవ్రత రం చేసింది. ఎందుకంటే యువత డెసిషన్ మేకింగ్‌లో భాగస్వామ్యం కోరుతోంది. ని ర్దిష్టమైన ఎజెండా, డిమాండ్లు లేనట్టుగా పైకి కనిపిస్తున్నప్పటికీ సోషల్ మీడియాను పునరుద్ధరించాలన్న నినాదం మరింత వి స్తరించింది. ఇప్పుడు పాలకుల అవినీతిని, బంధుప్రీతిని కూడా ప్రశ్నిస్తోంది. నిప్పంటుకున్నాక అది ఎంతకాలం మండుతు ందో, ఎక్కడికి పాకుతుందో, వే టిని తగలబెడుతుందో చెప్పలేం.
నేపాల్ లో యు వతరం తన గుండెలను మండి స్తున్న అ ంశాలన్నింటినీ ఇప్పుడు ముందు పెడుతో ంది. దేశ సమూల ప్రక్షాళనకు నడుం బిగిస్తోంది. నేపాల్ ప్రజలు అనతి కాలంలోనే ప్రజాస్వామ్యం మీద నమ్మకం కోల్పోయా రు. విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీలా కర్కీ తాత్కాలిక ప్ర ధానిగా ప్ర మా ణ స్వీకారం చేశారు.
నేపాల్‌లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుటప డు తున్నాయి. 2 026, మార్చి 5న ఎన్నిక లు నిర్వహించనున్నట్లు అధ్యక్ష కార్యాలయం కీలక ప్ర కటన చేసింది. కానీ ఈ ఉద్య మం అవినీతి పాలన కొనసాగిస్తున్న అధికారపక్షాలన్నింటికీ ఒక బలమైన హెచ్చరిక.
వ్యాసకర్త సెల్ : 9866255355