04-08-2025 12:00:00 AM
-స్థానిక ఎన్నికల్లో ఆపార్టీలకు గుణపాఠం చెప్పాలి
- మాజీ మంత్రి జోగు రామన్న పిలుపు
ఆదిలాబాద్, ఆగస్టు 3 (విజయ క్రాంతి ) : రైతులకు చేస్తున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు యువకులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారంటే నే కాంగ్రెస్, బీజేపీల అసంతృప్తి పాలనకు నిదర్శంగా నిలుస్తుందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం బేలా మండలంలోని అవాల్ పూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన పార్టీ చేరికల కార్యక్రమంలో అయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మా జీ మంత్రి సమక్షంలో గ్రామానికి చెందిన కిరణ్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, లతో పాటు మరో 50 మంది యువకులకు స్వచ్ఛందంగా బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.వారికి గులాబీ కండు వా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు జోగు రామన్న మాట్లాడుతూ.. అవల్పూర్ గ్రామంలో రూ.4 కోట్ల 16 లక్షలతో అభివృద్ధి పనులు పూర్తి చేసామన్నారు.
అలాగే 7 ఆలయాలు నిర్మాణాలతో పాటు సిసి రోడ్లు, దళిత బంధు కింద మూడు ఎకరాల భూమి, అలాగే ప్రతి రైతుకు రైతుబం ధు అందించమన్నారు. రైతు సంక్షేమానికి పాటుపడిన కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని ఆ దిశగా సంకల్పంతో పనిచేస్తామని పార్టీ లో చేరుతున్నట్టు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని పక్కనపెట్టి సీఎం రేవంత్ రెడ్డికి మద్దతు తెలుపుతూ అదిలాబాద్ అభివృద్ధి విషయంలో మాయమాటలతో కాల యాపన చేస్తున్నారని మండిపడ్డారు.
రిమ్స్ లో ఉద్యోగాలు తొలగించిన పట్టింపు లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే అండదండలతో అమ్మకానికి పెట్టిన సీసీఐ పరిశ్రమను, సీసీ ఐ సాధన సమితి ఆధ్వర్యంలో పున:ప్రారంభానికి కృషి చేస్తున్నామన్నారు. ఈ కాంగ్రెస్, బీజేపీ ఆలీబాబా 420 దొంగలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రమోద్ రెడ్డి, రౌతు మనోహర్, సతీష్ పవార్, దేవన్న, గంభీర్ టాక్రె, సురేష్, మస్కే తేజరావు, కిషన్, సంతోష్, కిరణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.