04-08-2025 12:00:00 AM
నిర్మల్, ఆగస్టు 3 (విజయక్రాంతి): కాంగ్రె స్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పెద్ద పీఠవేసి ప్రజారంజక పాలన అందిస్తుందని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావు అన్నారు. మామడ మండలం జగదాంబ తండా గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఆడే కృష్ణ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ఆదివారం హస్తం గూటికి చేరారు. వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతమైన పాలన అందిస్తుందని, అభివృద్ధి సైతం శరవేగంగా జరుగు తోందని అన్నారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేయలేని అనేక పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క రూ పని చేయాలన్నారు.