ప్రజలు కాంగ్రెస్ వైపే..

25-04-2024 02:31:44 AM

బీఆర్‌ఎస్, బీజేపీలు ఒక్కటే

మంత్రి కొండా సురేఖ

వరంగల్,  ఏప్రిల్ 24 (విజయక్రాంతి): పార్లమెంటు ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్ వైపే నిలుస్తారని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టంచేశారు. వరంగల్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి గా డాక్టర్ కడియం కావ్య.. మంత్రి సురేఖ, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డితో కలిసి బుధవారం మరో సెట్ నామి నేషన్ వేశారు. ఈ సందర్భంగా మీడియా పాయింట్ వద్ద మంత్రి సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటేనని ఆరోపించారు.

ఆ పార్టీలు అంతర్గతంగా చేసుకున్న ఒప్పందం ప్రకారమే కవితను అరెస్టు చేసి సానుభూతి పొందే ప్రయత్నాలు చేస్తుండగా పార్లమెంట్ సీట్లు గెలిస్తే బీజేపీకి మద్దతిచ్చి కవితను బయటకు తీసుకువచ్చేందుకు బీఆర్‌ఎస్ సిద్ధంగా ఉన్నదని విమర్శించారు. రాష్ట్రంలో 15 సీట్లు గెలుపే లక్ష్యంగా మిషన్ అనే నినాదంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేసేది కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో పార్టీలు మారడం అనేది సర్వసాధారణమేనని పేర్కొన్నారు. 

బీఆర్‌ఎస్ నాయకులు ప్రస్టేషన్‌లో మాట్లాడుతున్నారని విమర్శించారు. మొన్న టి ఎన్నికలలో ప్రజలు బుద్ది చెప్పినా బీఆర్‌ఎస్ నాయకుల మాటల తీరు మారడం లేద న్నారు. మతతత్వ విద్వేషాలు రెచ్చగొడుతూ బీజేపీ రాజకీయ లబ్దిపొందే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో వరంగల్ నుంచి ఎంపీగా డాక్టర్ కడియం కావ్యను గెలిపించాలని కోరారు.