25-10-2025 07:01:36 PM
ప్లాస్టిక్ ను నివారించాలి పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలి
ఎల్లారెడ్డి పట్టణంలో స్వచ్ఛ యాత్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్మోహన్
ఎల్లారెడ్డి పట్టణంలో స్వచ్ఛ యాత్ర.. ప్లాస్టిక్ వినియోగాన్ని నిలిపివేయాలని వ్యాపారస్తులకు సూచించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి పట్టణంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ఎమ్మెల్యే మదన్ మోహన్ శనివారం ‘ఎల్లారెడ్డి స్వచ్ఛ యాత్ర’ను నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి బైక్ పై పట్టణ పురవిధుల్లో పర్యటించారు. బస్టాండ్ ప్రాంగణంలో ఆయన స్వయంగా శుభ్రతా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్టీసీ డిఎంతో మాట్లాడి బస్టాండ్ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పట్టణంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తి స్థాయిలో తగ్గించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా డైలీ మార్కెట్ లో చికెన్ సెంటర్ల వద్ద ప్లాస్టిక్ వాడకాన్ని నిలిపివేయాలని వ్యాపారులకు సూచించారు. శివాజీ చౌరస్తాలో రూ. 15 లక్షల నిధులతో అందమైన బ్యూటిఫికేషన్ పనులు చేపడతామని బజరంగ్దళ్ విహెచ్పి ప్రతినిధులకుహామీ ఇచ్చారు.