calender_icon.png 28 August, 2025 | 1:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ వర్షాల పట్ల ప్రజలుఅప్రమత్తంగా ఉండాలి

28-08-2025 09:21:11 AM

  1.  వినాయక మండపాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
  2.  అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించండి.
  3.  హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల  ప్రణవ్ బాబు.

హుజురాబాద్,(విజయ క్రాంతి): భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని. హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ(Huzurabad Congress Party) నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ బాబు ప్రజలను కోరారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం సింగపూర్ తన స్వగృహం నుండి చరవాణి ద్వారా గురువారంఅధికారులను అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో హుజురాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,వరద ప్రభావిత ప్రాంతాలపై అధికారులు దృష్టిసారించాలని సూచించారు.

హుజురాబాద్, జమ్మికుంట పట్టణాల కమిషనర్లు,వివిధ మండలాల అధికారులతో ఫోన్ లో సంభాషించారు.వీలైనంత వరకు వరద నీరు నిలవకుండా ఉండేందుకు  చర్యలు తీసుకోవాలని కోరారు.మరోవైపు వినాయక మండపాల వద్ద నిర్వాహకులు జాగ్రత్తగా వ్యవహరించాలని,కరెంట్ స్తంభాలు ఇతరత్ర సరి చూసుకోవాలనీ,రైతులు వ్యవసాయ బాగుల వద్దకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని కోరారు .వాతావరణ అధికారుల సూచన మేరకు మరో మూడు రోజులు భారీ వర్షాల నేపధ్యంలో అవసరమైతే తప్ప ఇంట్లో నుండి బయటికి ఎవరు రాకూడదని తెలిపారు.లోతట్టు ప్రాంతాల్లో కాంగ్రెస్ శ్రేణులు కూడా తగిన సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని ఆదేశించారు.