29-10-2025 10:54:54 AM
అచ్చంపేట డి.ఎస్.పి పల్లె శ్రీనివాస్
అచ్చంపేట: మొంథా తుఫాను ప్రభావంతో అచ్చంపేట సబ్ డివిజన్ పరిధిలోని కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆయా గ్రామాల్లో వాగులు, వంకలు వరద నీటితో ఉదృతంగా ప్రవహిస్తున్నాయని అచ్చంపేట డిఎస్పి పల్లె శ్రీనివాస్ తెలిపారు. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వెళ్లవద్దని సూచించారు. పాత మట్టి ఇళ్ల ఉండవద్దని వాటిని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అచ్చంపేటకు ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారులు వరదనీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయని వరద ప్రవాహంలో వెళ్లేందుకు సాహసించవద్దని వాహనదారులకు, ప్రయాణికులకు సూచించారు. ప్రజల రక్షణార్థం సబ్ డివిజన్ పరిధిలోని పోలీసులందరూ అప్రమత్తంగా ఉన్నారని ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్న తక్షణం పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.