13-08-2025 06:36:28 PM
కలెక్టర్ హనుమంతరావు..
వలిగొండ (విజయక్రాంతి): రానున్న 72 గంటలలో యాదాద్రి భువనగిరి జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందని ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుండి బయటకు రావద్దని జిల్లా కలెక్టర్ హనుమంతరావు(District Collector Hanumantha Rao) అన్నారు. బుధవారం వలిగొండ మండలంలోని సంగెం గ్రామం వద్ద గల మూసీ వరద పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉందని అన్ని శాఖల అధికారులకు సెలవులు రద్దు చేయడం జరిగిందని వారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటారని అన్నారు. వరద ప్రవాహాలు ఎక్కడ ఉంటాయో అక్కడ ప్రాణనష్టం సంభవించకుండా సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని వాహనదారులు వరదలలో సాహసం చేయవద్దని ప్రజలు అధికారులకు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దశరథ, ఎంపీడీవో జలంధర్ రెడ్డి, ఎస్ఐ యుగేందర్ గౌడ్, ఎంఆర్ఐ కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.