13-08-2025 06:31:00 PM
ఇద్దరికి జైలు..
సిద్దిపేట క్రైమ్: ఇటీవల సిద్దిపేట పట్టణంలోని ప్రధాన చౌరస్తాల్లో పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిని బుధవారం కోర్టులో హాజరు పరిచారు. ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్(Traffic CI Praveen Kumar) సిబ్బందితో కొన్ని రోజుల క్రితం నర్సాపూర్, ఎంపీడీవో ఆఫీస్ చౌరస్తాలతో పాటు రాజీవ్ రహదారిపై వాహనాలు తనిఖీ చేయగా, 40 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్టు నిర్ధారించారు.
వారిని సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు ముందు హాజరుపరచగా, విచారణ చేసి 40 మందికి రూ.72 వేల 500 వేల జరిమానా, ఒకరికి మూడు రోజుల జైలు శిక్ష విధించారు. అదేవిధంగా టూటౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, సిబ్బందితో కొన్ని రోజుల క్రితం నర్సాపూర్ చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేయగా, నలుగురు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుబడ్డారు. వారికి న్యాయమూర్తి రూ.6,500 జరిమానా విధించారు. వారిలో ఒకరికి 5 రోజుల జైలు శిక్ష పడింది.