calender_icon.png 18 May, 2025 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ నెల 24న వైరాలో మెగా జాబ్ మేళా..

17-05-2025 10:00:09 PM

పోస్టర్ను ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్..

వైరా (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా వైరాలో ఈనెల 24వ తేదీన మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నారు. నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన కోసం వైరా నియోజకవర్గ కేంద్రంలో మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్(MLA Maloth Ramdas Nayak) పేర్కొన్నారు.  మెగా జాబ్ మేళా ను ప్రతి ఒక్కరూ  వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ను శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka)తో కలసి ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, పిసిసి కార్యదర్శి నూతి సత్యనారాయణ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్, వైరా మండల పార్టీ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, కొనిజర్ల మండల పార్టీ అధ్యక్షులు వడ్డే నారాయణరావు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, వైరా నియోజకవర్గ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు పమ్మి అశోక్, కన్నెగంటి నగేష్, పణితి శ్రీను, నాయకులు జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్క శేఖర్ గౌడ్, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజని, నల్లపు దుర్గాప్రసాద్, డాక్టర్ రవి, తదితరులు పాల్గొన్నారు.