calender_icon.png 18 May, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దాతలు ముందుకు రావడం అభినందనీయం

17-05-2025 10:05:47 PM

ఆలయ నిర్మాణానికి విరాళాల సేకరణ..

రాజాపూర్: మండల పరిధిలోని తిర్మలాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ హనుమాన్ దేవాలయం నిర్మాణం కోసం శనివారం దాతలు గుర్రంకడి రామ్ లక్ష్మణ్ రూ.51వేలు, మల్లి జంగయ్య రూ.51 వేలు, కావలి విష్ణు రూ.11 వేలు విరాళాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ... ఆలయ నిర్మాణం కోసం విరాళాలు అందించేందుకు మరింత మంది ముందు ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిపాల్ రెడ్డి, పుల్లారెడ్డి, నర్సింహా మూర్తి, సత్యనారాయణ గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, నర్సింలు, యాదగిరి, శ్రీనివాస్, రెడ్యా నాయక్, శ్రీనివాస్, రాజు, సి.నర్సింలు, కృష్ణయ్య, బాలు, తదితరులు పాల్గొన్నారు.