17-05-2025 10:38:16 PM
తల్లి బిడ్డను కాపాడిన పోలీసులు...
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ శనివారం బాన్సువాడ పట్టణంలోని కలికి చెరువులో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి మహిళను ఆమె వెంట ఉన్న పసికందును కాపాడారు. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆత్మహత్య యత్నానికి యత్నించిన మహిళను కాపాడిన ఏఎస్ఐ జయ, కానిస్టేబుల్స్ నవీన్, సౌజన్య, నవీన్, అంజయ్య, శ్రీనివాస్ లు పాల్గొన్నారు. అనంతరం అమ్మాయిలకు కౌన్సిలింగ్ నిర్వహించారు.