calender_icon.png 18 May, 2025 | 3:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన జర్నలిస్టు సంఘం అధ్యక్షుడికి ఘన సన్మానం

17-05-2025 10:13:08 PM

పూలమాలవేసి సన్మానించిన ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి..

దేవరకద్ర: దేవరకద్ర నియోజకవర్గం కేంద్రంలో నూతన జర్నలిస్టుల సంఘం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ మేరకు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి(MLA G Madhusudhan Reddy) సంఘం అధ్యక్షులు షఫీ ఉపాధ్యక్షులు ఎల్ల స్వామి, కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించి అభినందించారు. దేవరకద్ర మండలం గోపన్ పల్లి గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. జర్నలిస్టులో సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంత ముఖ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో సంగం గౌరవ అధ్యక్షులు రమేష్ చారి ప్రాణేష్ చారి, శ్రీనివాసులు పాల్గొన్నారు.