calender_icon.png 18 May, 2025 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీ నిధులచే ఐమాక్స్ దీపాలు..

17-05-2025 10:03:27 PM

మూసాపేట: మూసాపేట మండలం వేముల గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎంపీ ల్యాడ్స్ పథకం కింద డీకే అరుణ నిధుల నుంచి రూ.2 లక్షలతో వేముల గ్రామం బస్టాండ్ చౌరస్తాలో ఐమాక్స్ లైట్స్ ఏర్పాటు చేయడంతో మూసాపేట బిజెపి మండల అధ్యక్షులు టికే నర్సింహులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గతంలో ఎప్పటి నుంచో ఇక్కడ పెద్ద విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని చెప్పినప్పటికీ ఎవరు పట్టించుకోలేదని, ఇప్పుడు ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మహబూబ్ నగర్ జిల్లా ఎంపీ డికె అరుణ, జిల్లా ప్రసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, పాలమూరు పార్లమెంట్ కన్వీనర్ డోకూర్ పవన్ కుమార్, దేవరకద్ర అసెంబ్లీ ఇన్చార్జ్ కొండా ప్రశాంత్ రెడ్డి తదితరులకు గ్రామస్తులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.