04-07-2025 01:47:04 AM
హైదరాబాద్, జులై 3 (విజయక్రాంతి): ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డైరక్టరేట్‌లో 166 కొత్త పోస్టుల నియామకానికి తెలంగాణ ఆర్థికశాఖ అనుమతించింది. ఈ మేరకు గురువారం ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రణాళిక విభాగం వివిధ క్యాడర్‌లో 166 పోస్టుల భర్తీకి ప్రతిపాదించింది.
దానితో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా జిల్లా స్థాయిలో వివిధ క్యాడర్ 38 పోస్టులను తీసివేసింది. కొత్త పోస్టుల భర్తీలో చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్, స్టాటిస్టికల్ డైరెక్టర్, డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్, సూపరింటిండెంట్, సీనియర్ అసిస్టెంట్ సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులున్నాయి.