20-09-2025 07:40:04 PM
ఇల్లంతకుంట,(విజయక్రాంతి): ఇల్లంతకుంట మండలంలోని పలు రోడ్ల నిర్మాణానికి వెంటనే చర్యలు చేపట్టాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను శనివారం ఆదేశించారు. మండల కేంద్రంలోని ప్రధాన బస్టాండ్ వద్ద కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించి అధికారులను ఆదేశించారు.
అనంతరం బైక్ మీద వెళ్ళి తాళ్ళపల్లి గ్రామంలోని రోడ్లను పరిశీలించి రోడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, అలాగే తాళ్లపల్లి నుండి బేగంపేటకు వెళ్లే ప్రధాన రహదారిలో బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. అంతకుముందు 23 కళ్యాణ లక్ష్మి, 51 సీఎంఆర్ఎఫ్ చెక్కులను మండల పరిషత్ కార్యాలయంలో అందించారు.