calender_icon.png 27 September, 2025 | 3:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టుదలనే ఫలితాన్ని ఇచ్చింది

27-09-2025 01:54:59 AM

సిద్దిపేట, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): వసతి గృహం వంట మనిషి కుమారుడు ఉన్నత చదువులు చదివి గ్రూపు 1 ఉద్యోగం సాధించాడు. సిద్దిపేట పట్టణం కాళ్లకుంట కాలనీ లో నివా సం ఉంటున్న ఎర్రోళ్ల పద్మ మల్లేశం దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు శ్రీనివాస్ కానిస్టేబుల్, రెండవ కుమారుడు శ్రీకాంత్ కోటిలింగేశ్వర ఆలయంలో ఉద్యోగి కాగా చిన్న కుమారుడు ఆంజనేయులు ప్రభుత్వ వసతి గృహం వార్డెన్ ఉద్యోగం చేస్తున్నాడు.

తాను ఉన్నతమైన ఉద్యోగ సాధించాలనే పట్టుదలతో చదివి గ్రూపు 1 ర్యాంక్ సాధించి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఏంపిడివో) ఉద్యోగం సాధించాడు. తండ్రి మల్లేశం ప్రభుత్వ వసతి గృ హంలో వంటమనిషిగా పని చేస్తూ పిల్లలను ఉత్తములుగా తీర్చిదిద్దారని స్థానికులు, బంధువులు అభిందిస్తున్నారు. ఆంజనేయులును మిత్రులు, సన్నిహితులు అభినదిస్తున్నారు.