27-09-2025 01:56:27 AM
ఎమ్మెల్యే డాక్టర్ పి. సంజీవరెడ్డి
నారాయణఖేడ్, సెప్టెంబర్ 26: పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రభు త్వ లక్ష్యమని ఎ మ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ని యోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పా ల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటినుండి అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పార్టీలకు అతీతంగా ప్ర భుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని అన్నారు.
రూ. 67, 43,000 లక్షల చెక్కులను 226 మంది లబ్ధిదారులకు ఆయన అందజేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రతి పేదవాడికి 10 లక్షల రూపాయల వరకు ఆసుపత్రి వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. అంతకుముందు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలో పాల్గొని మంగళ పేట్ దుర్గ భవాని అమ్మవారి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.