calender_icon.png 22 September, 2025 | 6:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి

22-09-2025 05:29:14 PM

ఐసిడిఎస్ సూపర్వైజర్ గిరిజ..

దౌల్తాబాద్: గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ గిరిజ సూచించారు. జాతీయ పోషణ మాసం సందర్భంగా మండలంలోని తిర్మలాపూర్ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులతో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ గిరిజ మాట్లాడుతూ రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, సీజనల్ పండ్లు తీసుకోవాలన్నారు. ప్రతీరోజు భోజనంలో ఒక పూట చిరుధాన్యాలతో కూడిన భోజనం ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు. అభాకార్డు, అపార్ కార్డు జనరేట్ చేసి వాటి ప్రాముఖ్యత గురించి వివరించారు. రక్త హీనత వల్ల జరిగే నష్టాల గురించి ఆమె వివరించారు.