04-08-2025 08:01:11 PM
కరీంనగర్ (విజయక్రాంతి): నగరంలోని కోటా ఇన్స్టిట్యూట్(KOTA Institute)లో ప్రధమ సంవత్సరం విద్యార్థుల ప్రెషర్స్ పార్టీ కార్యక్రమము కోటా-పరిచయ్ 2k25 అనే పేరుతో రేకుర్తిలోని ఒక ప్రైవేటు కన్వెన్షన్ లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోటా ఇన్స్ట్సిట్యూట్, కోటా పబ్లిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ డిఅంజిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధ్యాయ బృందం బోధనతో విషయ పరిజ్ఞానం, నైతిక విలువలు అలవర్చుకొని వారిని ఆదర్శంగా తీసుకుంటూ జీవితంలో మరో అడుగు ముందుకు వేసి, రాబోయే పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచి విద్యాసంస్థకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్ధులకు జ్ఞాపికలను అందచేసారు. అంజిరెడ్డి జన్మదిన వేడుకలు కూడా ఘనంగా నిర్వహించారు. అనంతరం విద్యార్థుల నృత్య ప్రదర్శనలు పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఈ కార్యక్రమములో ప్రిన్సిపాల్ బి సుదర్శన్ అధ్యాపకులు, అధ్యాపకేతర బృందంతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.