04-08-2025 07:58:37 PM
నిర్మల్ (విజయక్రాంతి): ఆయిల్ ఫామ్ తోటలు సాగుచేసిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ గెలల రేటును పెంచిందని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి బివి రమణ(District Horticulture Officer B.V. Ramana) తెలిపారు. జులై నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ గెలల రేటును ఒక మెట్రిక్ టన్నుల గాను 18052 రూపాయలకు పెంచడం జరిగిందని ఇది రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. జిల్లాలో ఆయిల్ ఫామ్ తోటలు సాగుచేసిన రైతులు పంట చేతికొస్తున్న నేపథ్యంలో మార్కెట్ సౌకర్యం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆయన వివరించారు.