03-01-2026 06:52:22 PM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): మండల కేంద్రం అర్వపల్లిలోని కేజీబీవీ పరిశీలనకు వచ్చిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు పాఠశాలల్లోని సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని శనివారం పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలెబోయిన కిరణ్ పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వర్షం వచ్చిన ప్రతిసారి పాఠశాల ఆవరణలోకి మోకాళ్ళలోతు వర్షపు నీరు చేరి విద్యార్థినీలు నానా అవస్థలు పడుతున్నారు.
వర్షం వచ్చిన ప్రతిసారి పాఠశాలకు సెలవులు ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదన్నారు. పాఠశాల సమస్యలపై అనేక రూపాల్లో ఆందోళనలు, నిరసనలు, కలెక్టరేట్లో ఫిర్యాదు చేసినా నిమ్మకు నిరత్తనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలపై స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. కార్యక్రమంలో వజ్జె సాయి,నవీన్,మహేష్ తదితరులు ఉన్నారు.