27-09-2025 08:52:29 PM
మండల పశు వైద్యాధికారి డాక్టర్ సరస్వతి
మణుగూరు,(విజయక్రాంతి): పెంపుడు జంతువుల నుంచి సంక్రమించే వ్యాధుల పట్ల పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలని మండల పశు వైద్యాధికారి డాక్టర్ సరస్వతి అన్నారు. శనివారం ఆమె మాట్లాడుతూ... ఆదివారం ర్యాబిస్ వ్యాక్సిన్ డే సందర్భంగా వెటర్నరీ హాస్పటల్ లో ప్రత్యేక క్యాంప్ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. జంతుపెంపకం దారులు ఈ వ్యాక్సిన్ ను తమ తమ జంతువులకు వేయించాలని కోరారు. ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు క్యాంప్ పశువైధ్యశాలలో ప్రత్యేక క్యాంపు ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని పశు పోషకులు, జంతువు ప్రేమికులు, సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.