calender_icon.png 8 December, 2025 | 9:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీజీ మూడో సెమిస్టర్ పరీక్ష వాయిదా వేయాలి

08-12-2025 07:56:18 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): శాతవాహన యూనివర్సిటీ విద్యార్థుల ఆధ్వర్యంలో పేజీ మూడో సెమిస్టర్ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. గ్రామపంచాయతీ ఎలక్షన్ సందర్భంగా గ్రామాలలో ఎలక్షన్ జరుగుతుంటే వీసీ  తన సొంత నిర్ణయాలతో ఇదే సమయంలో  పరీక్షలు నిర్వహించడం సరైనది కాదని, యూనివర్సిటీలో చాలా దూర ప్రాంతాల నుండి వచ్చి చదువుకుంటున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. వారు వెళ్లి రావాలన్న చాలా సమయం పడుతుంది అవేవి ఆలోచించకుండా పరీక్షలు నిర్వహించడం సరైనది కాదు. 

డిసెంబర్ నెలలోనే సెట్ ఎగ్జామ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. యూనివర్సిటీలో చాలామంది విద్యార్థులు సెట్టుకు ప్రిపేర్ అవుతున్న పరిస్థితి ఉంది. కావున పరీక్షలను తాత్కాలికంగా వాయిదా వేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా యూనివర్సిటీలోని లైబ్రరీ టైమింగ్స్ పెట్టి విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నరని, యూనివర్సిటీ అంటేనే విద్యార్థులు కోటి ఆశలతో కాంపిటీషన్ పరీక్షలకు సిద్ధం కావాలని వస్తే ఇక్కడికి వచ్చాక విసి లైబ్రరీని మూసివేస్తున్న పరిస్థితి ఉంది. కావున తక్షణమే వైస్ ఛాన్స్ లర్ చొరవ తీసుకొని విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని  విద్యార్థులు డిమాండ్ చేయడం జరిగింది.