calender_icon.png 1 November, 2025 | 10:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచే సేవారంగం ఫార్మసీ

01-11-2025 12:00:00 AM

ఐజంట్ డ్రగ్స్ రిసెర్చ్ సొల్యూషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.వి.ఎన్. రాజు

ఘట్ కేసర్, అక్టోబర్ 31 (విజయక్రాంతి) : ఫార్మసీ కేవలం మందులు తయారు చేసే రంగం కాదని పరిశోధన, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచే సేవారంగమని ఐజంట్ డ్రగ్స్ రిసెర్చ్ సొల్యూషన్  సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.వి.ఎన్. రాజు అన్నారు. ఘట్ కేసర్ మున్సిపల్ కొండాపూర్ లోని సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఆటనమస్ ఇన్స్టిట్యూషన్లో శుక్రవారం ఒరియెంటేషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐజంట్ డ్రగ్స్ రిసెర్చ్ సొల్యూషన్  సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.వి.ఎన్. రాజు  హాజరయ్యారు. కార్యక్రమానికి సంస్థ చైర్మన్ ఎ.వి. రమణారెడ్డి, డైరెక్టర్ డాక్టర్ మల్లాడి రామకాంత్ రెడ్డి, ఫార్మసీ ప్రిన్సిపల్ డాక్టర్ కె. శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. కొత్తగా అడుగుపెట్టిన ఫార్మసీ విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్య అతిథి ఎస్.వి.ఎన్. రాజు మాట్లాడుతూ ఫార్మసీ రంగం భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా కీలకమైన పాత్ర పోషించనుందని తెలిపారు.

ఫార్మసీ కేవలం మందులు తయారు చేసే రంగం కాదని ఇది పరిశోధన, అభివృద్ధి, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచే సేవారంగమన్నారు. వైఫల్యాలను కూడా క్రీడాస్ఫూర్తితో స్వీకరించాలని, విజయాన్ని పొందాలంటే ముందుగా వైఫల్యాన్ని అంగీకరించే ధైర్యం ఉండాలన్నారు. ప్రతి వైఫల్యం ఒక పాఠం, ఒక కొత్త మార్గం చూపుతుందన్నారు. డైరెక్టర్ డాక్టర్ మల్లాడి రమాకాంత్ రెడ్డి  విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ .. మీరు ఫార్మసీ ప్రపంచంలోకి మొదటి అడుగు వేస్తున్నారని ఇది కేవలం విద్యా రంగంలో అడుగు కాదని మానవ సేవకు మొదటి పిలుపు అన్నారు.

వైట్ కోట్ అనేది ఒక వస్త్రం మాత్రమే కాదు అది నమ్మకానికి ప్రతీక, నైతికతకు సంకేతం దానిని ధరించడం అంటే  సమాజం, రోగి, మానవ జీవితానికి సేవ చేయడానికి మీ అంకితభావాన్ని ప్రకటించడమే అని పేర్కొన్నారు. మీ వైట్ కోట్ను గౌరవంగా ధరించి దానిని మానవతా విలువలతో నింపండని, మీ విజయాలు మీ తల్లిదండ్రులకు, మీ గురువులకు, మా సంస్థకు గర్వకారణం కావాలన్నారు.