31-10-2025 11:41:32 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని వెంకటాపురం గ్రామం పరిధిలోగల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల లో భాగంగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, అంకురార్పణ, నివేదన, తీర్ధప్రసాద గోష్టి నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో చైర్మన్ కొమ్మారెడ్డి నరేష్ కుమార్ రెడ్డి, ఈవో సల్వాద్రి మోహన్ బాబు, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.