06-07-2025 06:28:55 PM
టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలం సులానగర్ గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన మాజీ వైస్ ఎంపీపీ ఉండేటి ప్రసాద్, సులానగర్ మాజీ సర్పంచ్ అజ్మీరా బుజ్జి -శివ కుమారుడు అజ్మీరా అశోక్ ల కుటుంబాలను ఆదివారం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy), ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యలు పరామర్శించారు. మృతి చెందిన వారి నివాసానికి వెళ్లి వారి చిత్రపటాలకు నివాళులు అర్పించి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్, మండల అధ్యక్షులు భూక్యా దేవనాయక్, నాయకులు ఈది గణేష్, మోకాళ్ళ పోశాలు, మధురెడ్డి, బోడ మంగీలాల్, ముచ్చా సుధాకర్, భద్రు నాయక్, చెన్నయ్య, లక్కీనేని శ్యామ్, బొడ్డు అశోక్, గురవయ్య, కుమార్, మాజీ ఎంపీటీసీ శంకర్, ఊళ్ళోజి ఉదయ్, సర్దార్, నరసయ్య, బానోత్ రవి, మూడ్ సంజయ్, సరిరాం, అఫ్రోజ్, హనుమంతు, ఊకె నరేందర్, సత్యం, లకావత్ శ్రీను, కోటి,విజయ్, జానకిరాములు, శివాజీ, సుధీప్ తదితరులు పాల్గొన్నారు.